HomeEntertainmentనిర్మ‌లా సీతారామ‌న్ తో..ప‌వ‌న్ క‌ల్యాణ్

నిర్మ‌లా సీతారామ‌న్ తో..ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో గౌరవనీయులైన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లు కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో మార్పుల కోసం విన్నవించారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 31 డిసెంబర్, 2024 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదు. రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని కోరుచున్నాం. డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వగలరు.. నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 70% (AIIB) :30 %+ పన్నులు (AP ప్రభుత్వం) విధానం నుంచి 90% (AIIB) :10% (AP ప్రభుత్వం) మార్పు చేసి.. 455 మిలియన్ US డాలర్ల (అంటే రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదలను మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img