వీడు మామూలు వాడు కాదు..పెళ్లి పేరుతో ఏకంగా 50 మంది యువతులను మోసం చేశాడు ఓ వ్యక్తి.. హైదరాబాద్‌కి చెందిన వంశీ కృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. విగ్గులు మారుస్తూ, కులాలకు తగ్గట్లు తన పేరు మార్చుకుని, తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా మ్యాట్రిమోనిలో పేర్కొన్నాడు వంశీ. పెళ్లిచూపుల అనంతరం కట్నకానుకలు తీసుకుని ముఖం చాటేసిన మోసాలకు పాల్పడ్డాడు. ఓ మహిళా డాక్టర్‌ను రూ.50 లక్షల మేర మోసం చేయడంతో బయట పడ్డాయి అతడి బాగోతాలు..