మత్తుపదార్ధాల ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంటే.. గుట్టుచప్పుడు కాకుండా బిజినెస్ చేస్తున్నారు కేటుగాళ్లు. రోజుకో పద్దతిలో డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలతో గతకొన్ని రోజలుగా యమా స్పీడుమీదున్న పోలీసులు.. లేటెస్ట్‌గా వైజాగ్‌లో ఓ ముఠా గుట్టు రట్టు చేశార…దాదాపు 44 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్స్‌ను వెనక్కు రప్పించామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు. పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇక నుంచి ఏపీలో మత్తుపదార్ధాలు అన్న మాట వినిపిస్తే దబిడిదిబిడే అంటున్నారు పోలీసులు. వచ్చే ఆరు నెలల్లో సీరియస్ డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు.