నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు విడుదల కానుంది.15.86 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)ను ఏపీ ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12 టీఎంసీల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ) అనుమతి ఇచ్చింది.గత నెల 25తేదీ నాటికి 9.55 టీఎంసీల నీటిని వాడుకున్నామని, 32.25 టీఎంసీల జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని ఏపీ ప్రభుత్వం లేఖలో తెలిపింది.