బీజేపీ-శివసేన-ఎన్సీపీతో కూడిన మహాయుతి 150 నుంచి 195 సీట్లతో గెలుపు ఖాయమని 4 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, టౌమ్స్ నౌ-జేవీసీ, పీపుల్స్ పల్స్ ఈ అంచనాలు వేశాయి. మాట్రిజ్ 150-170, పీపుల్స్ పల్స్ 175-195, చాణక్య స్ట్రాటజీస్ 152-160, టైమ్స్ నౌ-జేవీసీ 150-160 సీట్లు మహాయుతి కూటమికి వస్తాయని . విపక్ష కూటమికి 85 నుంచి 138 వరకూ రావచ్చని పేర్కొన్నారు.
కాగా, పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీ కూటమికి 128-142 వరకూ రావచ్చని, ఎంవీఏకు 125-140 రావచ్చని లోక్‌షాహి మరాఠీ ముద్ర అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ సైతం మహాయుతికి 125-140, ఎంవీఏకు 135-150 అంచనా వేసింది..