HomeEntertainmentజాతిర‌త్నాలు@ 4ఇయ‌ర్స్

జాతిర‌త్నాలు@ 4ఇయ‌ర్స్

తెలుగు సినిమా కరోనా దెబ్బతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బాగుంటే కరోనాను కూడా లక్ష్య పెట్టకుండా థియేటర్‌లకు వచ్చి సినిమాలను చూస్తారు అని జాతిరత్నాలు సినిమా నిరూపించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన జాతిరత్నాలు సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా, కామెడీ అంటే ఇలా కూడా చేయవచ్చా అంటూ ఫిల్మ్‌ మేకర్స్ సైతం నోరు వెళ్ల బెట్టి చూసే విధంగా, ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా జాతిరత్నాలు సినిమా నిలిచింది.జాతిరత్నాలు 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫరియా సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకంకు 4 ఏళ్లు అయిందంటే నమ్మలేకుండా ఉంది. ఈ సినిమాను గత నెలలోనే అన్ని చోట్ల ప్రచారం చేసినట్లు, ఇటీవల ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. జాతిరత్నాలు సమయంలో పొందిన అనుభూతులను ఇప్పుడు మిస్‌ అవుతున్నాను. ఇప్పటికీ నన్ను మీలో చాలా మంది చిట్టీ అని పిలుస్తున్నారు. అలాంటిది అప్పుడే నాలుగు ఏళ్లు పూర్తి కావడం అనేది ఆశ్చర్యంగా ఉందని ఫరియా పోస్ట్‌ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read