HomePoliticalకామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి.. పురందేశ్వరి

కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి.. పురందేశ్వరి

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రేలియాలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, మన దేశం నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సిపిసిలో చర్చించడంతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంపు తదితర సమల్సపై చర్చలు ఉంటాయి.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా, బిజెపి సభ్యత్వ నమోదుకు సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ పురందేశ్వరిని కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా, నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈనెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే సమావేశాల్లో పాల్గొని, 11వ తేదీన మనదేశానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img