HomePoliticalవైసీపీ ఆధ్వ‌ర్యంలో.. ద్రోణంరాజు జ‌యంతి వేడుక‌లు

వైసీపీ ఆధ్వ‌ర్యంలో.. ద్రోణంరాజు జ‌యంతి వేడుక‌లు

కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి వేడుకలు పురస్కరించుకుని ఈరోజు సిరిపురం దగ్గర గల ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఆయన జయంతి వేడుకలు వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి ,మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ,మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ,తైనాల విజయకుమార్ , తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి ప్రముఖులు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర టైగర్ గా పిలవబడ్డారని ఆయన ఒక రాజకీయ యూనివర్సిటీ అని ఎంతోమంది రాజకీయ నాయకులు ఆయన తయారు చేసే ఘనత ఆయనకే దక్కిందని ఈరోజు ఎమ్మెల్యేలుగా మినిస్టర్ గా ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఆయన శిష్యులేనని అలాగే ఆయన కుమారులు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్కూ డా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఎదిగారని ఈరోజు ఆయన కుమారుడిగా వచ్చిన శ్రీవత్సవ కూడా అటువంటి లక్షణాలే కలిగి ఉన్నాడని తెలియజేసారు……


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు కోడూరి అప్పలరత్నం , బిపిన్ కుమార్ జైన్ ,ఊరుకుటి చందు గారు,మాజీ వుడా చైర్మన్ రవి ,బెహారా భాస్కరరావు ,తిప్పల దేవన్ రెడ్డి , జాన్ వెస్లీ ,మంత్రి రాజశేఖర్ ,పైల శ్రీను ,సీనియర్ మహిళ నాయకురాలు పేడాడ రమణికుమారి , విశాఖపట్నం దక్షిణనియోజకర్గం వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు,అలాగే విశాఖ జిల్లా వైస్సార్సీపీ నాయకులు ద్రోణంరాజు అభిమానులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీవత్సవ గారు మాట్లాడుతూ మా తాతగారు అయినటువంటి సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో కృషిచేసేవారని తెలియజేశారు అలాగే మా తండ్రిగారు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు రాజకీయ రంగంలో మచ్చలేని మనిషిగా పేరు సంపాదించుకున్నారని వారిద్దరి అడుగుజాడల్లో నేను నడుస్తానని తెలియజేసారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read