తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి?’ అంటూ పత్రికలో వచ్చిన వార్తను తన ట్వీట్‌లో జత చేశారు.తన అరెస్ట్ కోసం సీఎం వేచి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
కానీ సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ముందా? మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ముందా? ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయడానికి దమ్ముందా? పైవాటిని చేసే దమ్ముందా? లేదా? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి ‘మేఘా’కు గులాంగిరీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.