టీటీడీ చైర్మన్, టీవి5 చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై శనివారం అవనిగడ్డ నియోజకవర్గ టీవీ5 రిపోర్టర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ సీఐ కార్యాలయంలో సీఐ యువ కుమార్ సమక్షంలో ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు అందచేశారు. పోసాని వ్యాఖ్యలు హిందువులను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు అల్లర్లు, గొడవలు తెచ్చేందుకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు తీసుకోవాలన్నారు.