HomeDevotionalశ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌..ద‌ర్శ‌నాలు ప్రారంభం

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌..ద‌ర్శ‌నాలు ప్రారంభం

ఆదివారం నుండే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రమే ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్‌ను ట్రావెన్‌కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలిరోజే 30వేల మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు.పోటెత్తిన భక్తులు శబరిమల ఆలయం మండల మకరవిళక్కు పూజల కోసం తెరుచు కుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా.. భారీగా అయ్యప్ప భక్తులు తరలిరావడంతో ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారు లు వెల్లడించారు. ఈ ఏడాది నిత్యం 80 వేల మందికి దర్శనాలు కల్పిం చాలని నిర్ణయించారు.

అయితే ఇందులో 70 వేల మందికి ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. మరో 10 వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు. మకరవిళక్కు సీజన్‌లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవ డంతో మొదటిరోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలిరోజే వర్చువల్‌ బుకింగ్‌ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్‌లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్‌ కుమార్‌ నంబూథిరి తెరిచినట్లు అధికారులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img