127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది…వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారుమూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ నూతన డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు పరిపాలక ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి అభివృద్ధి సంక్షేమం కోసం 127 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణవాసులు రాజన్న భక్తులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరీకి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.