HomePoliticalప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంతో మందికి స్ఫూర్తి..నాని

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంతో మందికి స్ఫూర్తి..నాని

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు క‌థానాయకుడు నాని. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో సినీ నటుడు రానా హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షోకు గెస్ట్‌గా హాజ‌రయ్యాడు నాని. నానితో పాటు ప్రియాంక అరుళ్ మోహ‌న్, తేజ స‌జ్జా కూడా ఈ షోలో సంద‌డి చేశారు. అయితే ఈ షోలో రానా అడిగిన పలు ప్రశ్నలకు నాని స‌మాధాన‌మిస్తూ పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించాడు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టుడిగా సినీ రంగంలో ఎలా ఎదిగాడో అంద‌రికి తెలిసిందే. మెగాస్టార్ త‌మ్ముడిగా ఎంట్రీ ఇచ్చి ప‌వ‌ర్ స్టార్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప‌వన్ సినీ రంగంలో రాణించిన‌ట్లే రాజ‌కీయ‌ల్లో సైతం ఎదిగార‌ని తెలిపాడు. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో పవన్ ఎంతో మందికి స్ఫూర్తి అని నాని చెప్పుకోచ్చాడు. ఇక నాని వ్యాఖ్య‌ల‌పై రానా మాట్లాడుతూ.. ప‌వ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చార‌ని.. అత‌డు నిజ‌మైన సూప‌ర్ స్టార్ అని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img