తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు.
అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా.. మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుంది.
దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో ఝార్ఖండ్ ప్రజలు చూపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారు.
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు.