హర్షసాయి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు హర్షసాయి పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరుపనుంది. సదరు నటి హర్ష సాయితో కలిసి సినిమాలో నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించింది. అంతకు ముందు ఓటీటీ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.పోలీసుల కథనం ప్రకారం హర్షసాయి, ఆ నటి మధ్య ఓ పార్టీలో కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని నటి ఫిర్యాదులో ఆరోపించింది. హర్షసాయి సోషల్ మీడియాలో పెద్ద బెట్టింగ్ మాఫియానే నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి