కథను నమ్మి సినిమాలు చేసే సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ , విజయ్ సేతుపతి . ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాంఛైజీలో విడుతలై పార్ట్ 2 కూడా వస్తోందని తెలిసిందే. సూరి మరో లీడ్ రోల్ పోషిస్తోన్న సీక్వెల్‌లో మంజు వారియర్ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను రాత్రి 8 గంటలకు లాంచ్ చేయనున్నట్ట ప్రకటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల పార్ట్ 1తో తమిళ్ కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సూరి ఎంట్రీతోనే మంచి హిట్టు అందుకున్నాడు. ఈ ప్రాంఛైజీలో విజయ్ సేతుపతి గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటిస్తున్నాడు. సీక్వెల్‌లో మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజువారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.