ఢిల్లీలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఢిల్లీ సీఎం అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ అనూకూల ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాగాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ‘ఎక్స్’లో ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరిలో జరగాల్సి ఉండగా, వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆప్ ఉంది.