రాష్ట్రంలోని జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు . అమరావతి సచివాలయం లోని మీటింగ్ హల్ లో గుర్తింపుపొందిన జర్నలిస్ట్ సంఘాల నాయకుల సమావేశంలో పార్ధ సారధి మాట్లాడుతూ జర్నలిస్తుల భీమా 10 లక్షలకు పెంచే యోచన తో పాటు అక్రీడిటేషనల ప్రక్రియ పూర్టీ అవ్వగానే ఇళ్ల స్థలాలవిషయం పరిష్కారం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెప్పారు. సమాచార డిరెక్టర్ హిమాన్ష్ శుక్ల కూడా పాల్గొన్నారు.