వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు వచ్చేలా ఏఐ సేవలు – ధ్రువపత్రాల సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రయత్నం – మెటాతో ఏపీ సర్కార్ ఎంవోయూఏదైనా సర్టిఫికెట్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసులు, వివిధ హోదాలో ఉన్న అధికారులు, సిబ్బంది చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు సైతం చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలలో నిరీక్షణ తప్పదు.
వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఈ సర్టిఫికెట్ల కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సప్లో ఒక్క టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికే అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నాయి. అదే విధంగా ప్రతి సేవలూ అందుతున్నాయి..అలాంటప్పుడు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వంలోకి రాగానే వాట్సప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.