సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని ఇటీవల కొలీజియం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టినరోజు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. ఆయనతో కలిపి సుప్రీంకోర్టులోన్యాయమూర్తుల సంఖ్య 33కి చేరుతుంది. మంజూరైన సంఖ్య ప్రకారం మరొక్క న్యాయ మూర్తిని నియమించాల్సి ఉంది.
