HomePoliticalగల్ఫ్ మృతులకోసం…రూ.6 కోట్ల 45 లక్షలు

గల్ఫ్ మృతులకోసం…రూ.6 కోట్ల 45 లక్షలు

2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా..
కాగా ముఖమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న ₹6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది.గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు ₹1 కోటి 75 లక్షలు, జగిత్యాలకు ₹1 కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు ₹60 లక్షలు, నిర్మల్ కు ₹50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు ₹20 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img