శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో మలయాళ నటుడు దిలీపు వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. దేవస్థానం బోర్డుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా హైకోర్టు ఈవిషయాన్ని సుమోటోగా తీసుకొని విచారించింది.చాలా సమయం పాటు నటుడు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని టీడీబీని ప్రశ్నించింది. ఆయన వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డారని ఆలయ యాజమాన్యం పై హై కోర్ట్ కూడాఆగ్రహం వ్యక్తం చేసింది.