పెళ్లిపీటలెక్కాడు దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావును పెళ్లాడారు తిరుమలలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ పెళ్లికి హీరో సుహాస్ తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. అలాగే నటుడు వైవా హర్షతో పాటు మరికొందరు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. కాగా, ‘కలర్‌ఫొటో’ మూవీ చిత్రీకరణ సమయంలో చాందినీతో సందీప్ రాజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఇవాళ తిరుమలలో ఒక్కటయ్యారు. ఈ కొత్త జంటకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇక తొలి సినిమాతోనే సందీప్ రాజ్ ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన రెండో మూవీని రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్‌తో తెరకెక్కిస్తున్నారు. ‘మోగ్లీ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
