ఏపీ వ్యాప్తంగా 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో నిర్వహించిన ఈ తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సరదాగా గడిపారు. చంద్రబాబు, లోకేశ్ ఈ హైస్కూల్లో టగ్ ఆఫ్ వార్ ఆటలోనూ పాల్గొన్నారు. చంద్రబాబు ఓవైపు తాడును పట్టుకోగా… నారా లోకేశ్ మరోవైపు తాడును పట్టుకుని బలప్రదర్శన చేశారు. చంద్రబాబు లాగిన వైపే మొగ్గు కనిపించింది. దాంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.