తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ . స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ ఈ సినిమాను నిర్మించగా.. సిరుత్తై శివ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరజయం అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం విడుదల నెల కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో నటించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
