మలయాళ స్టార్ నటుడు జయరాం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. జయరాం కుమారుడు, యువ నటుడు కాళిదాస్ జయరాం ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మోడల్ తరిణీ కళింగరాయర్‌ను కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఈ పెళ్లి జరుగగా.. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్‌గోపి దంపతులు.. పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన అందరూ కాళిదాస్, తరిణీ కళింగరాయర్‌లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పావ కదైగల్ , హ్యాపీ సర్దార్ , విక్రమ్ , ‘ఇండియన్ 2’, ‘ధనుష్ 50’ చిత్రాలతో కాళిదాస్ జయరాం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాలో ప్రభంజన్ పాత్రలో కాళిదాస్ అలరించారు. విక్రమ్ సినిమాలో కాళిదాస్ క్యారెక్టర్ ఉండేది కొద్దిసేపే అయిన తన నటనతో మంచి మార్కులు సంపాదించాడు. మరోవైపు తరణీ మోడల్‌గా రాణిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో ఆమె మూడో రన్నరప్‌గా నిలిచింది.