డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరిపు కాల్స్ వచ్చాయి.. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి.. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్ లు పంపాడు ఆగంతకుడు. బెదిరిపు కాల్స్, సందేశాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన సిబ్బంది. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు పేషీ అధికారులు.
