రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని అరెస్ట్ చేయగా.. వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్శన్‌కు భారీ ఉపశమనం లభించింది. కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూర్ చేసింది. ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర గౌడ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 30న వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్‌కు హైకోర్టు ఆరు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే తాజాగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్టైంది.