డాబా గార్డెన్స్ (విశాఖ పట్నం):
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి అని నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి కోరారు. ఆయన విశాఖ డాబా గార్డెన్స్ లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో ఆదివారం జరిగిన ఆర్క్ వ్యాలి (గతంలో కిడ్జ్ గార్డెన్) స్కూల్ 25 వ (సిల్వర్ జూబ్లీ) వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఉపాద్యాయులు కృషి చేయాలి అని కోరారు. విద్యార్థులకు తల్లిదండ్రులు లక్ష్యాలు నిర్దేశించాలి అని కోరారు. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాద్యాయులు మార్గదర్శకులుగా వుండాలి అని అన్నారు. విద్యా ర్థులు కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి అన్నారు. పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ నిత్యం మననం చేసుకోవడం ద్వారా లక్ష్యం సాధించ వచ్చు అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకుని జీవీతంలో లక్ష్యం సాధించ వచ్చు అన్నారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఫిల్మ్ డైరెక్టర్, నటి శువశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ, బాల్యం జీవితంలో మరపురాని రోజులు అని అభివర్ణించారు. పాఠశాల మొదటి మెట్టు ఎక్కించే సంస్థ అన్నారు. మంచి , చెడు విచక్షణ వుండాలి అని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సాయి లక్ష్మి మాట్లాడుతూ, పాఠశాలలో ఏటా వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అని గుర్తు చేశారు. ఏక లవ్య , గాంధార విద్యలో కూడా తర్ఫీదు ఇస్తున్నాం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.