పోలవరం: తేనెటీగల దాడిలో బాంబ్ స్క్వాడ్ డీఎస్పీకి తీవ్ర గాయాలైన ఘటన పోలవరంలో జరిగింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో పోలవరంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్పిల్ వే గేట్ వద్ద ఆయన తనిఖీలు చేస్తున్న సమయంలో తేనెటీగలు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో రామకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.