HomeEntertainmentశ్రీతేజ్ గురించి ఆందోళ‌న చెందుతున్నా..

శ్రీతేజ్ గురించి ఆందోళ‌న చెందుతున్నా..

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను తాను కలవలేక పోతున్నానంటూ అల్లు అర్జున్ తెలిపారు. దురదృష్టకర సంఘటన తర్వాత వైద్య సంరక్షణలో ఉన్న శ్రీతేజ్‌ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణ కారణంగా.. ఈ సమయంలో శ్రీతేజ్‌ను, అతడి కుటుంబాన్ని కలవలేకపోతున్నాను. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతాను. వైద్యపరంగా, కుటుంబ పరంగా వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read