తిరుమల : ఏపీలోని తిరుమల్లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 24వ తేదీన విడుదల చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.