విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21-25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత సన్నిధిలో దీక్షలు విరమిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిధిలోని పూర్తి సమాచారం తెలిసేలా ‘భవానీదీక్ష 2024’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఈ యాప్ లో24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈవో చెప్పారు.