ముంబైలో గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈవెంట్ కూడా డిసెంబర్ 27 లేదా 28న జరుగనున్నట్లు తెలుస్తుంది. బిహార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ కంటే గ్రాండ్‌గా ఇది ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది…భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.