గేమ్ ఛేంజర్ నుండి ధోప్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి నాలుగవ సాంగ్ వచ్చేసింది. నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ‘ధోప్’ సాంగ్ టీజర్‌ను విడుదల చేయగా, అమెరికాలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించారు. ఫైనల్‌గా అభిమానుల కోసం యూట్యూబ్‌లో ఆదివారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను ఎస్ఎస్ థమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ శృతి రంజని పాడారు. ఫ్రెష్ మ్యూజిక్‌తో సంగీత ప్రియులను అలరించేలా ఈ సాంగ్ ఉంది. కాగా, గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ పాటలు విడుదలయాయి. ‘జరగండి జరగండి’, ‘దాం తు దిఖాజా’, ‘జానా హైరాన్ సా’ సాంగ్స్ జనాదరణ పొందాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నాడు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానుంది.