HomePoliticalనారా లోకేష్ కి పుత్రోత్సాహం..ప్ర‌పంచ‌రికార్డు సాధించిన దేవాన్ష్

నారా లోకేష్ కి పుత్రోత్సాహం..ప్ర‌పంచ‌రికార్డు సాధించిన దేవాన్ష్

9 ఏళ్ల నారా దేవాన్ష్ ‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక సర్టిఫికెట్ అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ ‘చెక్‌మేట్ మారథాన్’ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ వరుసగా సవాళ్లు విసిరే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కాంబినేషన్ల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు..ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 పావులను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

పిన్నవయసులోనే తనయుడు దేవాన్ష్ సాధించిన ఈ విజయంపై నారా లోకేశ్ పుత్రోత్సాహం ప్రదర్శించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ… “దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. చదరంగ క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ ఎరీనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందినట్టు తెలిసింది. దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతడి మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img