ప్రసిద్ద క్వాలిటీ రెస్టారెంట్ లో చోలా భతురా తిన్నారు రాహుల్ గాంధీ. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఈ రెస్టారెంట్ కి వచ్చారు.ఆ ఫొటోలని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ తన వాట్సాప్ స్టేటస్‌లో కుటుంబంతో కలిసి కూర్చుని భోజనం చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ చిత్రాలు నెటిజన్ల నుండి అనేక లైక్‌లు, కామెంట్స్ కూడా చేశారు. వీరిలో చాలామంది డైనింగ్ టేబుల్‌పై కొన్ని ప్రత్యేక క్షణాలను పంచుకున్న కుటుంబాన్ని అభినందించారు. ఫోటోలలో, రాహుల్ ఇతర కుటుంబ సభ్యులు రెస్టారెంట్‌లోని హాయిగా కూర్చుని వారి ముఖాలపై విశాలమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రాహుల్ తన స్టేటస్‌పై ఫోటోలను ఉంచుతూ, ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో కుటుంబ భోజనం” అని రాశారు.