హైదరాబాద్లో ఈరోజు నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు 39 మంది ట్రాన్స్ జెండర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తయింది.డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు సీపీ సీవీ ఆనంద్.తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ జ్వాల ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్జెండర్ల నియామకం ద్వారా… వారిని కలుపుకొనిపోవడమే కాకుండా మన సమాజంలో వారికి అధికారిక గుర్తింపును కూడా అందించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం చుడుతుంది” అని గుత్తా జ్వాలా పేర్కొన్నారు.