కాశీ యాత్రకి వెళ్లింది హీరోయిన్ సాయిపల్లవి. ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. తాజాగా కాశీకి వెళ్లిన ఆమె అక్కడి అన్నపూర్ణా దేవిని దర్శించుకుంది.ఈ సందర్భంగా బ్లూ కలర్ సల్వార్ సూట్, దుపట్టా, మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి.సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఆమె కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ గా మారాయి. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇందులో సాయి పల్లవి నటన మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.