HomeEntertainmentమ‌న‌వ‌డితో..పీలింగ్స్ వ‌చ్చాయంటోన్న బామ్మ‌..

మ‌న‌వ‌డితో..పీలింగ్స్ వ‌చ్చాయంటోన్న బామ్మ‌..

ఓ బామ్మా తన మనవడితో కలిసి పీలింగ్స్ పాటకు స్టెప్పులేసింది. అల్లు అర్జున్-రష్మిక మందన కలిసి నటించిన పీలింగ్స్ పాటకు తన మనవడితో కలిసి ఓ బామ్మా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.అందులో తన మనవడితో కలిసి ఓ బామ్మ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. చాలా మంది బామ్మను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టుకుని, అందమైన చిరునవ్వుతో, బామ్మ పుష్ప 2 పాటకు స్టెప్పులు వేసింది.ప్రజలు పుష్పాదాది అని ఆమె వీడియోను షేర్ చేస్తున్నారు. డిసెంబర్ 14న అక్షయ్ పార్థ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.ఈ బామ్మ, మనవడు కలిసి ఇంతకు ముందు అనేక పాటలకు డ్యాన్స్ చేశారు. చాలా వీడియోలను లక్షలాది మంది వీక్షించారు. వీరి ఇన్ స్టా ఖాతాకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img