సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
స్వయం సహాయక బృందాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం తొలి విడతలో 231 ఎకరాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పన, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వడంపై సీఎస్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఆలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.