ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏసుప్రభువు జన్మించిన రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటారని, లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పాస్టర్లకు ముఖ్యమంత్రి తినిపించారు. అనంతరం వేడుకలకు వచ్చిన వారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడారు.