లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తలు అబద్దం. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది కాబట్టే ఈరోజు ఇలా నేను బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొన్నారు. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని.. ఆ దేవుడికి తెలుసు. నా విషయంలో తీర్పును న్యాయం స్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానం నుంచి నేను నిర్దోషిగా బయటికి వస్తాను. ఆరోజు అందరి ముందుకు వచ్చి మాట్లాడుతాను. నేను ఇప్పుడు నిందితుడిని మాత్రమే. నాకు తెలిసింది ఒక్కటే విద్య. డాన్స్‌తో మిమల్ని ఎంటర్‌టైన్ చేయడం. మీ అందరి దీవెనల వల్లనే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను.. మీ అందరిని అలరించడానికి కష్టపడతాను.. మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు.