మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు.ఆయన మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిందికేంద్రం. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం. జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు. నేడు ఉదయం 11 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్. మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.
భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.
దేశపాలనలో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం: అమిత్ షా
మన్మోహన్ సింగ్ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
మన్మోహన్సింగ్ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్ సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.
మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు.. ఉన్నత విద్యావంతులు, అత్యంత సుందరమైన, మృదువుగా మాట్లాడే వినయపూర్వకమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత, ఆటను మార్చే సహకారాలు, వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా అత్యంత విజయవంతమైన పదవీకాలం చరిత్రలో నిలిచిపోతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి.





