హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. న్యూ ఇయర్ కానుకగా మేకర్స్ ఏదైనా అప్డేట్ అందిస్తారేమోనని చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం అదిరిపోయే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హరిహరవీరమల్లు ఫస్ట్ సింగిల్‌ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ పాటను పవన్ కల్యాణ్ పాడటం విశేషం. తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా పవన్ కల్యాణ్ వాయిస్‌తో పాట ఉండబోతుందట. ఇప్పటికే పవన్ కల్యాణ్ పాడిన పాటలు సూపర్ హిట్‌గా నిలువడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హైప్ క్రియేట్ చేశాయి. మరి పీరియాడిక్ డ్రామాకు స్టార్ యాక్టర్ వాయిస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.