పెద్దరికం అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దే అంటోంది నటి కస్తూరి..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ పై కేసు, అరెస్ట్ చేయడం, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో స్పందించారు. దీనిపై ప్రముఖ నటి కస్తూరి స్పందించారు. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన ప్రకటన చేశారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అంటూ కస్తూరి ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను గతానికి వదిలేసి 2025లోకి అడుగుపెడదాం అని కస్తూరి పిలుపునిచ్చారు.