HomeEntertainmentహీరో విజయ్ వ‌ల్లే.. నా కొడుకు బ‌తికాడు

హీరో విజయ్ వ‌ల్లే.. నా కొడుకు బ‌తికాడు

త‌మిళ హీరో వ‌ల్లే మా అబ్బాయి బ‌తికి ఉన్నాడ‌ని చెప్పారు న‌టుడు నాజ‌ర్.కాగా నాజ‌ర్ కొడుకుకి మేజర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు . 14 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. ఏ క్షణంలో డాక్టర్లు ఏం చెబుతారోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను. అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని నేను కోరుకున్నాను. ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ నాకు భయంగానే ఉంటుంది. మా అబ్బాయి కోలుకోవడానికి కారకుడు హీరో విజయ్ అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను” అని అన్నారు. కోమాలో నుంచి మా అబ్బాయి బయటికి వచ్చాడని తెలిసి మేము చాలా సంతోషించాము. అతను మా పేర్లు చెబుతాడని మేము అనుకున్నాము. కానీ అతను హీరో ‘విజయ్’ గురించి అడిగాడు. మా వాడికి విజయ్ అంటే పిచ్చి. ఆ విషయం తెలియగానే డాక్టర్లు విజయ్ సినిమాలు .. సాంగ్స్ చూపిస్తూ వెళ్లారు. అప్పటి నుంచే అతను నిదానంగా కోలుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలియగానే విజయ్ నేరుగా హాస్పిటల్ కి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన వల్లనే మా అబ్బాయి కోలుకున్నాడని నమ్ముతాను. ఇప్పుడు విజయ్ .. మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img