గతేడాది విడుదల చేసిన టీజర్‌పై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో విశ్వంభర టీం ఒరిజినల్ సీజీ టీంను మార్చేసిందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తుండగా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరి ఇదే నిజమైతే విశ్వంభర ట్రైలర్‌ను ఎలా కట్ చేయబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారనుందడంలో ఎలాంటి సందేహం లేదు.టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి విశ్వంభర . సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. పలు కారణాల వల్ల వాయిదా పడ్డది. కొత్త డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఆర్‌ఆర్‌ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విశ్వంభర వీఎఫ్‌ఎక్స్ పార్ట్ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్.