అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా, అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం..రథసప్తమి లోగో రూపకల్పనకు ఆహ్వానం..రథసప్తమి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు.. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.. రాష్ట్ర పండుగగా ప్రకటించిన అరసవెల్లి రథసప్తమి వేడుకలను ప్రతిభావంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు..ఈ వేడుకలకు ప్రత్యేక లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఆహ్వానించారు జిల్లా కలెక్టర్ ..నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వేడుకల నిర్వహణకు సంబంధించి విస్తృతంగా చర్చించిన అదికారులు..వేడుకలకు ముందు జిల్లా వ్యాప్తంగా సూర్య నమస్కారాలు నిర్వహించేలా కార్యక్రమాలు..
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి క్రీడలు, నగర వీధులలో శోభాయాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.లక్షలాది భక్తులు తరలి వచ్చే ఈ వేడుకలకు పార్కింగ్, లేజర్ షో, నమూనా దేవాలయాల ప్రదర్శన, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాల కౌంటర్లు, రవాణా సౌకర్యాలు, వసతి సౌకర్యాలు వంటి అన్ని అంశాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చ..రథసప్తమిని తొలిసారి మూడు రోజుల పాటు జిల్లాలో నిర్వహించనుండటంతో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయడానికి కృషి చేయాలని అదికారులకు పిలుపునిచ్చిన కలెక్టర్.