మహారాజ గతేడాది నవంబర్ లో చైనాలో 40వేలకు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ అయింది మహరాజ చిత్రం. చైనా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ Yi Shi Films అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. అయితే చైనా బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది మహారాజ. ఈ చిత్రం చైనాలో రూ.91.55 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఫిగర్‌తో చైనాలో2018 నుంచి అత్యధిక గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా మహారాజ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి యు జింగ్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేశారు. చైనాలో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన భారతీయ సినిమాగా మహారాజ నిలిచింది. గతేడాది జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన మహారాజ 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి జులై 12న ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
😊